
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 ఆగష్టు, 2025.
బిజెపి, టిడిపి, జనసేన కూటమితో వైసిపి కుమ్మక్కు
సిపిఐ(యం) ఖండన
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలన్న వైసిపి నిర్ణయం రాష్ట్ర ప్రజలను వంచనకు గురి చేయడమే. మోడి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా మత కల్లోలాలు సృష్టిస్తూ ప్రజల మధ్య విష బీజాలు నాటుతున్నది. మన రాష్ట్రాన్ని అదానీ లాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. ఇలాంటి బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ ల కొమ్ము కాయటం అంటే లౌకికతత్వానికి, మత సామరస్యానికి భంగం కలిగించడమే.
బిజెపి, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రానికి తీవ్ర హాని చేస్తున్నది. గత పదకొండు సంవత్సరాలుగా విద్రోహ పూరిత విధానాలను అనుసరిస్తున్నది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు జరప లేదు. ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నా రెండు ప్రధాన పార్టీలు గుడ్లప్పగించి చూస్తున్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ను ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నా మాట్లాడటం లేదు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న ఇలాంటి ఎన్డీఏ కూటమికి వైసీపీ ఎలా మద్దతునిస్తుందో రాష్ట్ర ప్రజలకు బహిరంగ వివరణ ఇవ్వాలి.
ప్రతిరోజు ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్ర హక్కుల కోసం టిడిపి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా గంభీరమైన ప్రసంగాలు చేస్తున్న వై.ిపి, అదే ఎన్‌డిఏ కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బలపర్చటం టిడిపితో కుమ్మక్కు కావటం తప్ప మరొకటి కాదు. దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ వివరణ ఇవ్వాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
