
ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 12 సెప్టెంబరు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : రుషికొండ రిసార్ట్స్‌ను సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియంగా మార్చడం గురించి...
అయ్యా!
విశాఖపట్నం శివారులోని రుషికొండ రిసార్ట్స్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై సూచనలు జేసేందుకు ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో పై అంశం మరియు మరికొన్ని అంశాలపై నా సూచనలు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను.
నిర్ణయం తీసుకునే ముందు నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను.
(1) రుషికొండ రిసార్ట్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు జేయడానికి వినియోగించాలి. రాష్ట్రంలోని బాలబాలికల మనో విజ్ఞాన వికాసాలకు, టూరిజం అభివృద్ధికి, ఇటువంటి మ్యూజియం ఉపయోగపడుతుంది. అన్ని ప్రముఖ నగరాలలో ప్రసిద్దిగాంచిన సైన్సు మ్యూజియంలు ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి.
(2) క్రొత్త రాష్ట్రానికి, అన్ని హంగులు కల్గిన గొప్ప నగరంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని మీరు పలుమార్లు ప్రకటించారు. రాజధాని నగరంలో ఉండాల్సిన ఇతర హంగులతోపాటు, భవిష్యత్తు తరాల విద్యా విజ్ఞాన, వినోద సాధనాలుగా సైన్సు మ్యూజియం, జంతు ప్రదర్శన శాల, బొటానికల్ గార్డెన్స్ కూడా ముఖ్యం. ఈ మూడు సౌకర్యాల ఏర్పాటు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(బి.వి.రాఘవులు)
సిపిఐ(యం)
పోలిట్‌బ్యూరో సభ్యులు
