పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సిపిఐ(యం) రాష్ట్ర బృందం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 సెప్టెంబర్‌, 2025.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై
కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సిపిఐ(యం) రాష్ట్ర బృందం

ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర ప్రతినిధి బృందం న్యూఢల్లీిలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్‌.పాటిల్‌, స్టేట్‌ ప్రాజెక్టు కమిషనర్‌ శ్రీ ప్రవీణ్‌ కుమార్‌, మినిస్ట్రీ ఆఫ్‌ జలశక్తి జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌ గార్లను కలిసింది. పోలవరం నిర్వాసితుల సమస్యలు విన్నవించడం జరిగింది. వారు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. వీటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ బృందంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌,  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, ఎ.ఎస్‌.ఆర్‌ జిల్లా కార్యదర్శి బొప్పెన్న కిరణ్‌ మరియు ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు డి.రమేష్‌ ఉన్నారు. మంత్రిగారికి సమర్పించిన మెమోరాండం జతచేస్తున్నాము.

(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org