మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 సెప్టెంబరు, 2025.
మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
సెప్టెంబర్‌ 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు బాలోత్సవ భవనం
రాష్ట్రంలో 10 మెడికల్‌ కాలేజీలు పిపిపి పేరుతో ప్రయివేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నది. దీనికి వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాము. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం సెప్టెంబర్‌ 21 (ఆదివారం)వ తేదీ ఉదయం 10:30 గంటలకు బాలోత్సవ భవనం (విజయవాడ)లో జరుగుతుంది.
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడకపోవడం గర్హనీయం. 10 మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించాలని తద్వారా అభివృద్ధికి, పేద, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు, మహిళలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని సిపిఐ(యం) కోరుతున్నది. మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణపై జరుగుతున్న ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలకు, ప్రజాసంఘాలకు, మేధావులకు, ప్రముఖులకు, ప్రజాతంత్రవాదులకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org