అమెరికా ట్రంప్ ఆర్థిక టెర్రరిజాన్ని ఎదుర్కొండి ప్రతి పట్టణంలోనూ నిరసన తెలియజేయండి

మీడియా స్క్రోలింగ్ :

అమెరికా ట్రంప్ ఆర్థిక టెర్రరిజాన్ని ఎదుర్కొండి 
ప్రతి పట్టణంలోనూ నిరసన తెలియజేయండి 
ఆంధ్రప్రదేశ్ యువతకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు

 ఇప్పటికే కక్షపూరితంగా మన దేశంపై టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించిన ట్రంపు ఇప్పుడు మరికొన్ని అడుగులు ముందుకేసి మన యువతకు ఉద్యోగ అవకాశాల్ని దెబ్బతీసి అభద్రతాభావములోకి నెట్టారు. అమెరికా కంపెనీలలో H1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. రాష్ట్రానికి వచ్చి ఇంకా తిరిగి వెళ్ళని వాళ్ళు త్రిశంకు స్వర్గంలో పడిపోయారు. 
మన భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె వంటి దేశాల్లో పని చేస్తున్న వారిని ఆదర్శంగా చూపి విశ్వ గురువుగా మారామని డాంబికాలు పలికిన మన ప్రధాని ఇప్పుడు విదేశాలపై ఆధారపడటం పెద్ద తప్పు అయిపోయిందని తల పట్టుకుంటున్నారు. ఇలాంటి అవకాశవాదంతో యువతను మభ్య పెట్టలేరు. ఇప్పటికైనా ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మన ఉద్యోగులకు ఎటువంటి ఆభద్రత లేకుండా ఆదుకోవాలని,  అమెరికాపై ఒత్తిడి తెచ్చి మన యువత భవిష్యత్తును కాపాడాలనీ కోరుతున్నాను. 

అమెరికా ఆర్థిక టెర్రరీజానికి, మోడీ లొంగుబాటుకు వ్యతిరేకంగా ఎక్కడకక్కడ నిరసన తెలియజేయాలని రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి యువతకు సిపిఎం రాష్ట్ర కమిటీ నిలుపునిస్తున్నది.
వి. శ్రీనివాసరావు 
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి