బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబరు, 2025.

 

డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరిపాలెం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నది. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం ప్రభుత్వమే అందించాలని కోరుతున్నది. 

దీపావళి సామాగ్రి నిల్వ, బాణసంచా తయారీ ఇతర అంశాల్లో  పరిశ్రమల యాజమాన్యం తగు రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

సంఘటనా స్థలాన్ని, బాధితులను పరిమర్శించడానికి సిపిఐ(యం) డా॥బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కమిటీ సభ్యురాలు డి.ఆదిలక్ష్మీ నాయకత్వంలో బృందం వెళ్లింది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి