ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 అక్టోబరు, 2025.
ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించనందున ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు గత కొన్ని రోజులుగా నిలిచిపోవడం వలన రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఎన్‌టిఆర్‌ వైద్య సేవ కింద ఎవరు ఆసుపత్రులలో చేర్చుకోవడం లేదు. పేదల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.
రాష్ట్ర వ్యాపితంగా ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం చేసుకుంటున్న రోగులు ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వలన ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే స్తోమత లేక నానా అవస్థలు పడుతున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రులకు కొంతమంది షిఫ్ట్‌ అవుతున్నా తగిన డాక్టర్లు, సిబ్బంది, మౌళిక సదుపాయాలు లేక సరైన వైద్యం అందడం లేదు. బడా కార్పొరేట్లకు, పారిశ్రామిక వేత్తలకు వేలకోట్ల రూపాయలు రాయితీలు, ప్రకటిస్తున్న కూటమి ప్రభుత్వం పేద ప్రజల వైద్యం కోసం అవసరమైన నిధులు విడుదల చేయకపోవడం బాధ్యతారాహిత్యం.
కావున రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి, ఆసుపత్రుల యాజమాన్యంతో చర్చించి, పేదలకు వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేటట్లు చూడాలని కోరుతున్నాను. తద్వారా వేలాది మంది రోగుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org