హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 19 మంది మరణించడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైవేలలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
