కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 అక్టోబరు, 2025.
కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి
హైదరాబాద్‌ నుండి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్‌ బస్సు కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురై ఇద్దరు చిన్నారులతో సహా దాదాపు 20 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.
బస్సులు నిర్వహించే ప్రయివేటు యాజమాన్యాలు ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు పాటించడం లేదు. హైవేలలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ(యం) కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌తో కూడిన బృందం పరామర్శించింది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org