
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 30 అక్టోబరు, 2025.
కామ్రేడ్ చింతకాయల బాబూరావు మృతికి సంతాపం
కామ్రేడ్ చింతకాయల బాబూరావు ఆకస్మిక మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. కామ్రేడ్ బాబూరావు తాడేపల్లి గూడెంలో ఒక సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నాయకుడిగా పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పలు రకాల బాధ్యతలు నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికులను కూడగట్టి ఎన్నో పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించారు. వారి మృతి కార్మికవర్గానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి శ్రీమతి శ్రీదేవి గారికి రాష్ట్ర కమిటీ సానుభూతిని ప్రకటిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
