రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలు నిలిపివేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 నవంబరు, 2025.
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈరోజు (10 నవంబర్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన విజయవాడలో జరిగింది. సమావేశం ఈ క్రింది తీర్మానం చేసింది.

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలు నిలిపివేయాలి
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను రాష్ట్రంలో అమలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. రాష్ట్రంలో పలు పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణను రాష్ట్రంలో నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. దీనిపై వెంటనే రాజకీయ పార్టీల సమావేశం జరపాలని రాష్ట్ర ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.
కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని ఆదేశాలిచ్చిన 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మన రాష్ట్రం గురించి పేర్కొనకపోయినా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలుకు పూనుకోవడం గర్హనీయం. బీహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ చేసిన సందర్భంలో దేశవ్యాపితంగా అనేక అభ్యంతరాలు వచ్చాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ లెక్క చేయలేదు. బిజెపి కూటమి ప్రభుత్వం దేశమంతా వ్యతిరేకించిన పౌరసత్వ చట్ట సవరణను, జాతీయ పౌరచట్ట రిజిష్టర్‌ చట్టాలను దొడ్డిదారిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ ద్వారా అమలు చేయడానికి పూనుకుంటున్నది.
తెలుగుదేశం పార్టీ గతంలో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించినా రాష్ట్రంలో ఇప్పుడు అమలుకు పూనుకుంటున్నది. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి కూడా ఎస్‌ఐఆర్‌పై తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఎస్‌ఐఆర్‌ అమలు చేయడాన్ని వ్యతిరేకించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org