
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 నవంబరు, 2025.
సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మక్కా యాత్రికులు 42 మంది మృతి చెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. చనిపోయినవారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులున్నట్లు తెలుస్తున్నది. చనిపోయినవారి భౌతికకాయాలను వారి కుటుంబ సభ్యులకు సత్వరమే అందేట్లు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. వారి కుటుంబాలను ఆదుకునేందుకు తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
