
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 నవంబరు, 2025.
శ్రీకాకుళం జిల్లా కార్గో ఎయిర్‌పోర్టుకు బలవంతపు భూసేకరణ చేయరాదని కోరుతూ పలాస ఆర్డీవో ఆఫీస్ వద్ద తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చిన ఈ ధర్నాకు అనుమతి నిరాకరించడం, గ్రామస్తులు ఎవరైనా రోడ్డెక్కితే అరెస్టు చేస్తామని పోలీసులు గ్రామస్తులు ఒంకులూరు, బిడిమి, రాంపురం తదితర గ్రామాల్లో ఎక్కడకక్కడే సభలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈలోగానే ఉదయం 6 గంటల ప్రాంతంలో సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వంకల మాధవరావును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును నిరాకరించడం దుర్మార్గం. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కార్గో ఎయిర్‌పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై నిర్బంధాన్ని మానుకోవాలని ప్రజల కోర్కె మేరకు కార్గో నిర్మాణం ఆపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
