కొత్త జిల్లాల ఏర్పాటుపై సిపిఐ(ఎం) హర్షం

కొత్త జిల్లాల ఏర్పాటుపై సిపిఐ(ఎం) హర్షం 
కొత్త జిల్లాలు, డివిజన్ల సరిహద్దులపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సిఫార్సులపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మూడు కొత్త జిల్లాలకు ఆమోదం తెలపటం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లోని ఆదివాసీ ప్రాంతాలను కూడా కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి