నెల్లూరు పట్టణం వేదాయపాళెం సమీపంలో ఆర్ డి టీ కాలనీలో సిపిఎం కార్యకర్త యువనాయకుడు, కళాకారుడు కామ్రేడ్ కె. పెంచలయ్య హత్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి సంతాపం ప్రకటించారు. హత్య చేసిన గూండాలను పట్టుకుని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ ప్రాంతంలో గంజాయి బారిన పడకుండా యువతను చైతన్య పరుస్తున్నందున ఓర్చుకోలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇలాంటి ముఠాలను కఠినంగా అణచి వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
