సిపిఐ(యం) అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.అప్పలరాజుపై పెట్టిన పి.డి.యాక్డు ఉపసంహరించుకొని విడుదల చేయాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 27 డిసెంబర్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: సిపిఐ(యం) అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.అప్పలరాజుపై పెట్టిన పి.డి.యాక్డు ఉపసంహరించుకొని విడుదల చేయాలని కోరుతూ...

అయ్యా!

సిపిఐ(యం) అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీ యం.అప్పలరాజుపై పి.డి.చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపడం విస్మయం కలిగిస్తున్నది. జీవితం అంతా ప్రజలకోసం, రైతులకోసం ధారపోసి, నిరంతరం సామాన్య ప్రజల జీవితం మెరుగుకోసం పనిచేస్తున్న మా పార్టీ నాయకుడ్ని ఒక నేరస్తుడిగా చిత్రీకరించి అరెస్టుజేయడం ఎవరి ప్రయోజనం కోసం ప్రభుత్వం పూనుకున్నదో ప్రజలు గమనిస్తున్నారు. రైతుల హక్కులకోసం పనిజేయడం నేరంగా ప్రభుత్వం పరిగణిస్తున్నదా! అనేక అక్రమాలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్న నేరస్తులు అందరి కళ్ళముందూ దర్జాగా తిరుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, శ్రీ అప్పలరాజును వేకువజామునే భారీగా పోలీసులను మోహరించి తీసుకెళ్ళడం ప్రజాస్వామ్యమేనా! ప్రభుత్వం ఆలోచించాలి.

వెంటనే మీరు జోక్యంజేసుకొని శ్రీ అప్పలరాజుపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకొని, ఆయనను విడుదలజేసేందుకు ఆదేశించాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(బి.వి.రాఘవులు)

సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు