
ప్రచురణార్ధం / ప్రసారార్ధం :
సినీనటి శారదకు సిపిఎం అభినందనలు
సినీ కళా రంగానికి చేసిన యావజ్జీవిత కృషికి గుర్తింపుగా కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం జే సీ డేనియల్ అవార్డు పొందిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆమెను హృదయ పూర్వకంగా అభినందించారు. గతంలో కూడా ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. తెలుగు, మలయాళ రంగాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కళా జీవితం ప్రజానాట్యమండలితో ప్రారంభమైంది. డా. రాజారావు ఆమెను ప్రోత్సహించి తీర్చి దిద్దారు. గతంలో పార్లమెంటు సభ్యురాలిగా తెలుగు దేశం తరపున ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
జె.జయరాం
ఆఫీస్ కార్యదర్శి
