కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 24న సిపిఎం ఛలో ఢిల్లీ

ఈరోజు 02 ఫిబ్రవరి, 2026 సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ (విజయవాడలో) జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై 

మార్చి 24న సిపిఎం ఛలో ఢిల్లీ 

మార్చి 9 నుండి 20 వరకూ దేశవ్యాప్త ప్రచారం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

బడ్జెట్ మోసం, లెక్కల గారడీ 

చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ ప్రభావంతో ఎపికి నిధులు తేవాలి

ఈ కేటాయింపుýతో పోలవరం పూర్తికి దశాబ్దాలు పడుతుంది

అప్ప్పులతో అమరావతి నిర్మించాల్సి ఉంటుంది

 

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకత విధానాలు, పార్లమెంటులో చేస్తున్న ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి 24న సిపిఎం ఆధ్వర్యాన చల్లోఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, అంతకుముందు మార్చి తొమ్మిదో తేదీ నుండి 20వ తేదీ వరకూ దేశవ్యాప్త ప్రచారం నిర్వహిస్తామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తెలిపారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా విజయవాడ వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 

పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్ మోసం చేసిదిగా ఉందని అన్నారు. నిధులకు కోతపెట్టారని, సంక్షేమ పథకాలను విస్మరించారని పేర్కొన్నారు. గతంలో ఆర్థిక వ్యవస్థ ఆశాజనగకంగా, శరవేగంగా ముందుకు పోతోందని గొప్పగా చెప్పారని, అది బడ్జెట్లో కనబడటం లేదని అన్నారు. గతేడాది ఇంతకన్నా గొప్పగా చెప్పినా కేటాయింపులు ఖర్చు చేయలేదని, అన్నిటికీ కోతలు విధించారని వివరించారు. ఈసారి లెక్కల గారడీ చేశారని, పోయినసారి కేటాయింపులకు ఇప్పటి కేటాయింపులకు పోల్చడం కాకుండా ఖర్చు అంచనాకు ఇప్పటి కేటాయింపులకు పోల్చి భారీగా కేటాయించినట్లు లెక్కల్లో  చూపారని అన్నారు, గతకేటాయింపులు, ఇప్పటి కేటాయింపులకు చూస్తే భారీగా తగ్గిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.5000 కోట్లుకుపైగా కేటాయించారని, ఈసారి రూ.3320 కోట్లు కేటాయించారని, అమరావతికి గతబడ్జెట్ నుండి నిధులు కేటాయిస్తే ఈసారి అప్ప్పులు ఇస్తున్నట్లు చూపించి మోసపూరితంగా వ్యవహరించారని తెలిపారు. ఉపాధి హామీచ{్టం అమలు కోసం రూ.95 వేల కోట్లు కేటాయించారని, ఇవి ఖర్చు చేయాలంటే రాష్ట్రాలు 40 శాతం ఖర్చు చేయాలని, అంటే రాష్ట్రాలు ఖర్చు పెట్టకపోతే నిధుల్లో కోతపెడతారని అన్నారు. ఇది పచ్చిమోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా రాష్ట్రం ఖర్చుపెట్టలేదుగనుక రద్దు చేశామని చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. 

ఎన్‌డిఏలో తెలుగుదేశం, జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత నుండి కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలో ఉందని, ఇప్పటికి అనేక రూపాల్లో మోసం చేస్తోందని అన్నారు. చంద్రబాబునాయుడు దూరదష్టి కలిగిన బడ్జెట్ అనడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకపోవడం వల్ల దాన్ని పూర్తి చేయాలంటే దశాబ్దాలు పడుతుందని తెలిపారు. అమరావతి కూడా అప్ప్పులపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. మూడు కారిడార్లు వస్తున్నాయని చెబుతున్నారని, అవి మన ఖనిజాలను తవ్వుకుపోవడానికి ఉద్దేశించిన కారిడార్లని అన్నారు. అవి కూడా ఈ ఏడాది పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదని అన్నారు. సెమీ కండక్టర్ చిప్స్ విషయంలో రూ.100 కోట్లు ఖర్చు పెడితే పది ఉద్యోగాలు కూడా రావని అన్నారు. గూగుల్ డేటా సెంటర్లకు ఇచ్చే పన్ను ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై లోకేష్ ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రోత్సాహకాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు వెళతాయి మినహా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగడపడవని తెలిపారు. ఆశలపై ఆధారపడి ప్రజలను మోసం చేసే బడ్జెట్ అన్నారు. ఎపికి అన్యాయం జరిగిందని తెలిపారు. కేంద్రంలో కీలకపాత్ర నిర్వహిస్తుదన్న చంద్రబాబు, పవన్‌కల్యాన్ తమ ప్రభావాన్ని వినియోగించుకుని నిధులు రాబట్టాలని అన్నారు. ఈ బడ్జెట్లో ఎందుకు రాబట్టలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు. మరోవైపు పార్లమెంటులో నాలుగు ప్రమాదకర బిల్లులు తీసుకొచ్చారని, వాటిని సిపిఎం వ్యతిరేకిస్తోందని అన్నారు. లేబర్‌కోడ్స్, విద్యుత్, జీరాంజీ, న్యూక్లియర్ లయబులిటీ, సీడ్‌బిల్లులు తీసుకువచ్చారని ఇవన్నీ రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ప్రజలకు నష్టం చేసేవని అన్నారు. వాటిని ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యాన దేశ వ్యాప్త ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు బట్టబయలు చేసి ప్రజలకు వివరించేందుకు కార్యక్రమం చేపట్టామని అన్నారు. 

 

భౌతికదాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం 

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలూ సహజమని కానీ భౌతికదాడులు నిర్వహించడం అభ్యంతరకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. వైసిపి నాయకులు అంబటి రాంబాబు అసభ్యంగా మాట్లాడారని వార్తలు వచ్చాయని, వాటిని సిపిఎంగా తీవ్రంగా ఖండించామని తెలిపారు. అలాగే ఆయన ఇంటిపై దాడి జరిగిందని అది కూడా తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. విమర్శలు చేశారనే పేరుతో భౌతికదాడులు చేయడం అభ్యంతకరమని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో పలువురు నాయకులపైనా దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయని, అటువంటి సంస్కతిని ప్రోత్సహించడం సరికాదని తెలిపారు. తెలుగుదేశం నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇటువంటి దాడులను అనుభవించారని, అధికారంలోకి రాగానే వాటినే అనుసరిస్తే అవి వెంటాడుతాయని, ఇటువంటి సంస్కతిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడులు, ప్రతిదాడులు, అసభ్య విమర్శల విషయంలో టిటిడి, వైసిపి రెండూ అతీతం కాదని, ఎవరు అధికారంలో ఉంటే వారు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలూ దాడుల సంస్కతిని, అసభ్యంగా మాట్లాడటాన్ని విరమించాలని సూచించారు. అలా చేస్తేనే రాష్ట్ర రాజకీయాలు ప్రజలకు అనుగుణంగా, వారు నమ్మేలా ఉంటాయని అన్నారు.