
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఫిబ్రవరి, 2026.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈనెల 2,3 తేదీలలో విజయవాడ (యం.బి.విజ్ఞానకేంద్రం)లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
తీర్మానం
డిమాండ్ కనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలి
స్త్రీ శక్తి పథకం తరువాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 67% నుండి 98% పెరిగింది. అయితే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిపోల్లోనే బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో మధ్యలో స్టేజీలలో ప్రయాణీకులను ఎక్కించుకోవడం లేదు. దిగవల్సిన ప్రయాణీకులను ఆగాల్సిన ప్రదేశంలోకాక ముందుకు వెళ్ళి ఆపుతున్నారు. అంతే కాక మహిళా ప్రయాణీకులను కొంతమంది పురుషులు మరియు సిబ్బంది హేళనగా మాట్లాడు తున్నారు.
బస్సులు ఆపకపోవడంతో విద్యార్థినులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో స్కూళ్ళకు, కాలేజీలకు చేరుకోలేకపోతున్నారు. ఆక్యూపెన్సీ పెరగడంతో, బస్సులు పాతవి కావడంతో తరచు మధ్యలో ఆగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో కూడా ఆగిపోయి ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీలు అవస్థలు పడుతున్నారు.
ఇందుకు ప్రధాన కారణం పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడమే! ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశాకే ఈ పథకం మన రాష్ట్రంలో అమలు చేశారు. కానీ పెరిగే ఆక్యుపెన్సీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయవలసిన బాధ్యతను వదిలేసింది. ఫలితంగా ప్రయాణీకులు తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రయివేటు బస్సులలో 3 ప్రమాదాలు జరిగాయి. ఈ బస్సులపై రవాణా శాఖ సరైన పర్యవేక్షణ లేదు. ప్రయాణీకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. వీటిని కూడా ఆర్టీసీ తీసుకొని నడపాలి. సిబ్బందిపై 30% పైగా పని ఒత్తిడి పెరిగిందని ఇన్‌సర్వీస్ మరణాలు కూడా పెరుగుతున్నాయని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. 11 వేల మంది సిబ్బంది కావాలని ఆర్టీసీ అడుగు తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణం సిబ్బందిని రిక్రూట్ చేయాలి. మహిళలు ఆధార్, ఇతర గుర్తింపు స్మార్ట్‌ఫోన్‌లో చూపినా అనేకచోట్ల అనుమతించడం లేదు. దీన్ని అనుమతించాలి.
అనేక గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల సర్వీస్‌లు లేవు. సక్రమంగా బస్సులు ఏర్పాటు చేస్తే మరింతగా ప్రయాణీకులు పెరిగే అవకాశం, ఆర్టీసీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విద్యుత్ వాహనాలకు అనుమతి ఇచ్చింది. స్త్రీశక్తి పథకం అనేక విధాలా ఉత్పత్తి పెరుగుదలకు, కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. ఇది స్త్రీ శక్తి పథకం ఎత్తివేయడానికి దారి తీస్తుంది.
కనుక ఇప్పటికే పెరిగిన ప్రయాణికులు అవసరానికి అనుగుణంగా తక్షణం అదనపు బస్సులను పెంచాలని, బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సులు వేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
= = = =
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
