రైతు నాయకుడు, అనకాపల్లి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజును జైలు నుండి విడుదల చేయడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 ఫిబ్రవరి, 2026.

 

రైతు నాయకుడు, అనకాపల్లి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజును జైలు నుండి విడుదల చేయడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. పిడి యాక్టు కింద సుమారు నెలన్నర క్రిందట అక్రమంగా అరెస్టు అయి విడుదలవడం ప్రజా ఉద్యమాలకు నైతిక విజయం. వాస్తవ పరిస్థితులకనుగుణంగా అడ్వైజరీ కమిటీ విడుదలకు సిఫార్సు చేయడం హర్షణీయం. బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు నిరంతరంగా పోరాటం చేస్తున్న అప్పలరాజును అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాపితంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రజా ఒత్తిడికి తలొగ్గి విడుదల చేయడం భూపోరాట, నిర్వాసితులందరికీ గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుంది. అభివద్ధి పేరుతో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడే వారికి సిపిఎం ఎప్ప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి