ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC) ద్వారా తునికాకు కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 14 ఫిబ్రవరి, 2026.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC) ద్వారా తునికాకు కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరుతూ...

అయ్యా!

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC) తునికాకు కొనుగోలుపై నవంబర్ 2025లో అటవీశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. మూడు నెలలు అవుతున్నప్పటికీ నేటికీ ప్రభుత్వం నుండి తునికాకు కొనుగోలు ప్రక్రియపై ఎటువంటి స్పందన లేదు. మన రాష్టంలో చింతూరు డివిజన్ 9, ఏలూరు డివిజన్ 2  మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో వేసవి సీజన్‌లో గిరిజనులకు, పేదలకు తునికాకు కొనుగోలు ద్వారానే ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే గిరిజనులు లక్షల రూపాయలు ఆదాయం కోల్పోతారు. ఇప్పటికీ తెలంగాణ రాష్టంలో తునికాకు కొనుగోలుపై నోటిఫికేషన్ ఇచ్చింది. ఏజంట్  ప్రక్రియ పూర్తి చేసింది. ఫిబ్రవరి 22 నుండి  తునికాకు చెట్టు చిగురు కొట్టడం ప్రారంభిస్తున్నారు.  కానీ మనరాష్టంలో నేటికి ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కావున ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తునికాకు కొనుగోలు వెంటనే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి