
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (నిన్న) సమాచార కమిషనర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 14 ఫిబ్రవరి, 2026.
కమిషనర్ గారికి,
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
విషయం : సమాచార సేకరణకు మీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ...
ఆర్యా!
రైట్ టు ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ (సమాచార హక్కుచట్టం) వచ్చిన తరువాత ప్రభుత్వం నుండి ఎవరైనా అవసరమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ సమాచారం తెలుసుకోవడానికి ఫిజికల్‌గా లేదా పోస్టు ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సి రావడం ఈ చట్ట పరిధిని పరిమితం చేస్తుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లో అవకాశం లేదు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇది చాలా అవసరం. ప్రజలందరూ ముఖ్యంగా నేటి యువతరం ఫిజికల్‌గా/ పోస్టు ద్వారానే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తే ఉపయోగంగా ఉంటుంది. దేశంలో ఒకటి, రెండు చిన్న రాష్ట్రాýలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల సమాచార కమిషన్ వెబ్‌సైట్ýలో ఆన్‌లైన్ సౌకర్యం ఉంది. టెక్నాలజీకి ముందు భాగాన ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ సౌకర్యం లేకపోవడం సరైంది కాదు.
కాబట్టి వెంటనే సమాచారం కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా మీ వెబ్‌సైట్‌లో సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
