
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 మార్చి, 2026.
మార్చి 27న అమెరికన్ సామ్రాజ్యవాద దాష్టీకంపై రాష్ట్ర సెమినార్
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో సామ్రాజ్యవాద దురాగతాలపై 2026 మార్చి 27న “21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం - అంతర్జాతీయ పరిణామాలు” అనే అంశంపై రాష్ట్ర సెమినార్ సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సెమినార్‌ను ఆలిండియా సీనియర్ నాయకులు, పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్ ప్రారంభిస్తారు. ఈ సెమినార్‌లో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ప్రొ॥ అంజిరెడ్డి వివిధ అంశాలపై మాట్లాడతారు. (ఆహ్వానం జతచేయబడింది) రోజంతా జరిగే సెమినార్ ఉదయం 10:30 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ` చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. ఈ సెమినార్‌లో ప్రజలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.
ఇరాన్‌పై అమెరికా ` ఇజ్రాయెల్ గత 20 రోజులుగా అత్యంత క్రూరంగా దాడి చేస్తున్నాయి. వందలాది మంది సాధారణ పౌరులు మరణిస్తున్నారు. ఆసుపత్రులు, స్కూళ్లపై అమానవీయంగా బాంబు దాడులు చేయడంతో విద్యార్ధులు, రోగులు అనేకమంది మరణిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నేతతో పాటు ముఖ్య సైనికాధికారులను, ముఖ్య అధికార యంత్రాంగాన్ని హత్య చేశారు. ఫిబ్రవరి 3న వెనిజులా అధ్యక్షుడితో పాటు అతని భార్యను కిడ్నాప్ చేశారు. ఇప్ప్పుడు క్యూబా వంతు అని అహంకార పూరితంగా ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఆయా దేశాల్లోని సహజవనరులను కొల్లగొట్టే ఉద్దేశంతో డ్రగ్స్, అణ్వయుధాలు కలిగి ఉన్నారనే నెపంతో అమెరికా దాడులు చేస్తున్నది. ట్రంప్ అనుసరిస్తున్న సైనిక, ఆర్ధిక నిర్ణయాల పట్ల అమెరికా లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన నమ్మిన బంటు యఎస్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేశారు.
భారతదేశంపై ట్రంప్ టారిఫ్ టెర్రరిజాన్ని ప్రయోగించాడు. భారతీయ విద్యార్థులు, ఐటి ఉద్యోగులను వీసా నిబంధనలతో వేధిస్తున్నారు. ట్రంప్ షరతులకు మోడీ లొంగిపోయి మన వ్యవసాయ రంగం, టెక్ట్స్‌టైల్స్, ఆక్వా, డెయిరీ, పౌల్ట్రీ రంగాలు నాశనాకి గురిచేస్తున్నారు. ట్రంప్ ముందు మోడీ మోకరిల్లడంతో మన సార్వభౌమాధికారమే ప్రశ్నార్థకంలో పడింది. అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద దురాక్రమణను రాష్ట్ర ప్రజలు నిరసించాలని, దీనిని ఖండించని కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలని, 27 సెమినార్‌ను జయప్రదం చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
