
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 మార్చి, 2026.
పోలవరం నిర్వాసితులకు ఒకే దశలో పునరావాసం పూర్తి చేయాలి
నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం వేయాలి
- సిపిఐ(యం)
పోలవరం నిర్వాసితులందరికీ దశలతో నిమిత్తం లేకుండా ఒకే దఫాగా పునరావాసం పూర్తి చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమానికి నోచుకోకుండా త్రిశంకు స్వర్గంలో జీవిస్తున్న ఏడు మండలాల మునÅ£ ప్రాంతాల్లో నిర్వాసితులకు నిద్రాహారాలు కూడా లేవు. ఈ స్థితిలో దశల పేరుతో 10 సంవత్సరాలు క్రితం ప్రకటించిన ప్యాకేజీనే ఇప్పుడు కూడా అమలు చేస్తామనడం దారుణం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని 10 లక్షలకు పెంచి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. నిర్వాసితుల సమస్యలను పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం వేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
బుధవారం అమరావతిలో కొంతమంది ఎంపిక చేసిన పోలవరం నిర్వాసితులను పిలిపించుకొని మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తులో మునిగిపోయే వారికి పునరావాసం పూర్తి చేయనున్నట్లు, అందుకు ఈరోజు 226 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించటం వాస్తవాలను పూర్తిగా పక్కదారి పట్టించడమే. ఇప్పటికైనా నిర్వాసితులు గుర్తుకురావడం మంచిదే అయినప్పటికీ ముఖ్యమంత్రి ప్రకటన పోలవరం బాధితుల పుండు పై కారం చల్లినట్టుగా ఉన్నది. ఊళ్ళు, ఇళ్ళు, భూములు కోల్పోయి బిడ్డల భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఉన్న నిర్వాసితులకు ఈ ప్రకటన ఏ మాత్రం ఊరట కల్పించేదిగా లేదు. కొద్ది మందిని మాత్రమే పిలిపించుకొని పాత ప్యాకేజీనే ప్రకటించడం జనాన్ని మోసం చేయటమే. పోలవరం డ్యామును నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఈ రెండు సంవత్సరాలలో ఒక్కసారి కూడా నిర్వాసితుల గ్రామాలను సందర్శించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రాజెక్టు అభివృద్ధిలో నిర్వాసితులకు భాగం కల్పించాలని వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరుతున్నాము. ఇటీవల విడుదలైన కాగ్ నివేదికలో లయడార్ సర్వేలో అవకతవÅ£లను, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. గమనంలోకి తీసుకొని ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని పెంచాలి. వెంటనే అన్ని గ్రామాలకు అధికారులను పంపి సర్వే చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, తర్వాత ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుతున్నాము.
మొత్తం నిర్వాసితులు లక్ష కుటుంబాలు కాగా మొదటి దశ పేరుతో 38 వేల కుటుంబాలకు అందులో 20 వేల కుటుంబాలకు ప్రయారిటీ పేరుతో వన్ టైం ప్యాకేజీ ఇవ్వటం పూర్తిగా అభ్యంతరకరం. 41.15 మీటర్ల ఎత్తులో కూడా మునిగిపోయే గ్రామాలను గుర్తించలేదు. సర్వే పూర్తిగా తప్పు. 45.75 మీటర్ల రెండో దశలో మునిగిపోతాయని చెబుతున్న గ్రామాలు మొదటి దశలోనే పోతున్నాయి. 75 నిర్వాసితుల కాలనీలకు గాను 26 కాలనీలు పూర్తయినా ఇందులో ఎక్కడా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కొన్ని గ్రామాలకు జనాన్ని బలవంతంగా తరలించారు. మరికొన్ని గ్రామాలకు పోవడానికి నిర్వాసితులు తిరస్కరించారు. కట్టిన ఇళ్ళు వర్షాలకు కారిపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణం కోసం మూడున్నర లక్షలు ఏ మూలకు చాలదు. కనీసం 5 లక్షలైనా ఇవ్వాలి. స్థలంకోసం 2 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం తాను సేకరించిన ఇంటి స్థలం కోసం 12.30 లక్షలు పెట్టికొంటున్నది. సొంతగా కొనుగోలు చేసుకునే వారికి కూడా ఇదే అమౌంట్ ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
