భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
రౌండ్ టేబుల్ సమావేశం
02 ఏప్రిల్, 2026 - బాలోత్సవ భవనం - విజయవాడ
తీర్మానం
కేజి బేసిన్ చమురు - సహజవాయువులో సగం రాష్ట్రానికివ్వాలి.
అసెంబ్లీ తీర్మానం చేయాలి
కష్ణా-గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువులో సగం రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని, ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఈరోజు సిపిఐ(యం) నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తోంది.ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలతోపాటు ప్రొఫెసర్లు, వివిధ ప్రజాసంఘాలు, సంస్థల ప్రతినిధులు పాల్గొని తీర్మానించారు.
కష్ణా`గోదావరి డి6 బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును (రోజుకు 21వేల టన్నులు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని అంచనా) రిలయన్స్ కంపెనీ పైపులైన్ల ద్వారా ఇక్కడ నుండి మహారాష్ట్ర, గుజరాత్‌కు గ్యాస్ సరఫరా చేసుకుని అక్కడ పరిశ్రమలు, ఇతర అవసరాలకు విక్రయించి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ వినియోగం రోజుకు నాలుగు వేల టన్నులు అత్యంత విలువైన సహజ వనరులను రాష్ట్రం కోల్పోయింది. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాలతో నిత్య కాలుష్యమేగాక బ్లోఅవుట్‌లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్రం విలువైన ప్రాణాలను కోల్పోతున్నది. నష్టాలు రాష్ట్రానికి, లాభాలు రిలయన్స్‌వి అన్న చందంగా ఉంది. నిక్షేపాలను కనుగొన్నపుడు లభించే ఉత్పత్తుల్లో ఆయా కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి వాటాగా సరఫరా చేసే చమురు, సహజవాయువులో 50 శాతాన్ని సంబంధిత రాష్ట్రాలకు కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం (పేరా 13.35) పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా సిఫార్సు చేసింది. కనుక ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఉత్పత్తి అవుతున్న కష్ణా-గోదావరి బేసిన్ సహజ వాయువులో సగం రాష్ట్ర అవసరాలకు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. చట్ట బద్ధంగా రావలసిన చమురు, సహజ వాయువు వాటా సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేయాలని ఈ సదస్సు కోరుతోంది. అలాగే గతంలో హామీ ఇచ్చినట్లు 50 వేల ఉద్యోగాలు కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. న్యాయమైన డిమాండ్ సాధనకు సాగించే ఉద్యమాలకు ప్రజలు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నది.
ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ చేసిన దురాక్రమణదారీ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రం తీవ్ర గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు హÃటల్ నిర్వాహకులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్‌చేస్తే సిలిండర్ ఎప్ప్పుడు వస్తుందో తెలియకపోవడంతో ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. అన్ని తినుబండారాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా పెరిగితే సకల నిత్యావసరాల ధరలు మిన్నంటే ప్రమాదం వుంది. అలాగే సహజవాయువు లేక గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు మూతబడిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా అధిక రేటుకు డిస్కాంలు విద్యుత్ కొనాల్సివస్తోంది. మన తీరంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ రాష్ట్రానికి కేటాయిస్తే కరెంటు కష్టాలు కూడా తగ్గేవి. ఇదంతా పరిశీలిస్తే రాష్ట్ర వనరులను సరిగా వినియోగించుకుంటే ఇలాంటి అనేక ఇబ్బందులు వచ్చేవి కాదని స్పష్టమవుతోంది.
కష్ణా`గోదావరి డి6 బేసిన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 20 ఏళ్ల క్రితం అప్ప్పుడున్న ప్రభుత్వాలు చట్టవిరుద్ధంగా కేటాయించాయి. కేజీ బేసిన్ డి6 రిలయన్స్‌కు కేటాయించిన సమయంలో 50 వేలమందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. కాని, నిర్మాణ సమయంలో 12 వేలమందికి ఉపాధి కల్పించగా తర్వాత ఉత్పత్తి సమయంలో నాలుగువేల నుండి ఐదువేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒఎన్‌జిసి అన్నా నిధులిచ్చి గ్రామాల అభివద్ధికి సహాయపడుతోందని, రిలయన్స్ అది కూడా చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో పంటలకు నీళ్లు వదిలితే రిలయన్స్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో మన వాటా మనకు వస్తే రూ.950 ఉన్న సిలిండర్ ధర రూ.300కు, యూనిట్ కరెంటు రూపాయికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వవచ్చు. పిఎన్‌జి ఇంకా తక్కువ ధరకే లభిస్తుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా ఇచ్చి మిగిలినది తీసుకెళితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. మన సహజ వనరులను రిలయన్స్‌కు అప్పగించి, మనం ఇబ్బంది పడటం అన్యాయం.
కెజి బేసిన్‌లో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన చమురు, సహజవాయువు వాటాను పొందేలా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ రౌండ్‌టేబుల్ కోరుతోంది. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గ్యాస్‌పై మన హక్కుకోసం ఉద్యమించాలని ఈ రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిస్తోంది.
ఈ సమస్యపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు కెజి బేసిన్ ప్రాంతంలో పర్యటించాలని, రాజమండ్రిలో ప్రజా సదస్సు నిర్వహించాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది.
మన గ్యాస్ - మన హక్కు
