
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 ఏప్రిల్, 2026.
అమరావతి రాజధానిగా రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణ పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. అమరావతి ప్రాంత సరిహద్దులను నిర్దిష్టంగా రూపొందించి భవిష్యత్తులో ఎలానో గందరగోళానికి తావు లేకుండా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.
అయితే రాజధానిని ఆమోదించడమంటే దాని నిర్మాణానికి కూడా కేంద్రం బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే విభజన చట్టంలోని పలు హామీలు ఆచరణకు నోచుకోలేదు. ప్రత్యేకహోదాను విస్మరించారు. మన రాష్ట్ర అసెంబ్లీ కూడా దాన్ని పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణానికి నిధులతో పాటు ప్రత్యేకహోదా, కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీతో పాటు విభజన హామీలు అమలు చేయాలి. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
