పోలవరం డయా ఫ్రంవాల్ నష్టానికి బాధ్యులపై చర్య తీసుకోవాలి రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఏప్రిల్, 2026.

పోలవరం డయా ఫ్రంవాల్ నష్టానికి బాధ్యులపై చర్య తీసుకోవాలి

రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టాలి.

-సిపిఐ(యం) డిమాండ్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రంవాల్ దెబ్బతినడం మూలంగా పునర్నిర్మించడానికి అదనంగా రూ.1000కోట్లు ఖర్చు పెట్టినట్లు ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రకటనలపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. డయాఫ్రంవాల్ 2019లోనే పూర్తయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన భారీ వరదలకు అది దెబ్బతిన్నది. దీనికి ఎవరు కారణమో గత, ప్రస్తుత ప్రభుత్వాలు తేల్చకుండా తిరిగి కాంట్రాక్టర్లకు అదనపు నిధులు సమకూర్చినందున రూ.1000 కోట్లు ప్రజాధనం వధా అయింది. దీన్ని సంబంధిత బాధ్యుల నుండి రాబట్టాలి. దీనికి బాధ్యత ఎవరిదో తేల్చాలి. ప్రభుత్వ అధికారులదా? లేక కాంట్రాక్టర్లదా నిర్దారణ చేయాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. రెండోసారి డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని భద్రతపై నిపుణులతో పర్యవేక్షణ చేయించాలని, వారి నివేదికను ప్రజలకు వెల్లడించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి