హైకోర్టు తీర్పుపై సిపిఐ(యం) హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 ఏప్రిల్, 2026.

హైకోర్టు తీర్పుపై సిపిఐ(యం) హర్షం

రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వేతనాలతో ఏళ్ళ తరబడి తాత్కాలిక ఉద్యోగులతో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీక్రిందకే వస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్దమని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ళతరబడి 3 లక్షల మందిని ఔట్‌సోర్సింగ్ పేరిట, మరో లక్ష మందిని కాంట్రాక్టు పేరిట, దాదాపు 30 వేల మందిని దినసరి, కంటింజంట్, పార్ట్‌టైమ్, కన్సాలిడేటెడ్, ఎనఎంఆర్ పేరిట ఏళ్ళ తరబడి అతి తక్కువ వేతనాలతో, ఎటువంటి సౌకర్యాలు అమలు చేయకుండా కొనసాగిస్తున్నది. కనీసం రెగ్యులర్ ఉద్యోగుల మినిమమ్ టైమ్‌స్కేల్‌ను కూడా అమలు చేయడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ రెగ్యులర్ చేయాలని, ఈలోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు ఈ నెల నుండే అమలు చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది. 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి