సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ...

 

CPI(M) AP State Committee <[email protected]>

 

Sat, Apr 25, 1:02 PM (3 days ago)

 

 

 

to 10, CH, Chinni, Sneha, SK, AIR, Air, AJAY, Lakshmi, Chalapathi, Anand, Ravindar, Jagadesh, VM, Andhra, Andhra, Govind, T.Rakesh, Social, P, Surendra, NTV, Narendra, PTI, Suma, Eswar, ChN, Andhra, Bharath, K, Somasekhar, Somasekhar, Venkatreddy, Subhash, bujjibabu, Gopikishore, Sridhar, B, GVS, Ramana, ameen, Ameer, Gopi, Varaprasad, Vijaya, Mahesh, Kiran, M.Srikanth, Madhu, Sunil, Ganesh, Guru, Indian, K.Parda, Mukkanti, Kasanagottu, Khaisar, TV, kranthi, Sannapaneni, Narayanarao, No, PMR, Andhra, Anand, P, Sivaji, TV, Priudvi, Professor, R, The, Ravichand, B, PV, Saradhi, Amaraiah, Punnam, Murty, Pawan, Eenadu, Lakkireddy, Srinivas, K, K, Suresh, Appaji, GVR, Nagaraja, Samadhani, Samadhani, VV, V6, Nagesh, Rantnakar, Visalandra, Kanchala, PURNA, Mindela, muralivjanews, Mahaan, isr, Kranthi, Ramesh, srinivas, Ytv, p.narendrasrinivas, ravidc369, JOURNALIST, Naagasrineevaas, kseenadu, B.Tulasidas, Rajagopal, Prakampana, Uma, surya, VenkateshWarlu, vaarthavja, sreekanth, D, vijayavadacityvaarttha, roopanivja, shiva, [email protected], sankarbattiprolu, Madhav, apparao, VENKATESWARA, krishna, RAVI, VINAY, vijay, zieman1964, eenaduvja, Ch, ravi, veera, Raju, sankar, ravicpim2010, Vikram, murali2media, Raghavendra, syamala.bolla, vijay, disignervja7799, Prudhviraj, nethajimphil, news

 

 

 

 

 

 

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 ఏప్రిల్, 2026.

శ్రీయుత నారా లోకేష్ గారికి,
విద్యాశాఖా మాత్యులు, మంగళగిరి శాసనసభ్యులు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం:సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ...
అయ్యా!
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి సహా రాష్ట్రంలో చేనేత, దాని అనుబంధ పనులపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరు తయారు చేసిన వస్త్రాలకు అంతర్జాతీయంగా, జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నది. రాష్ట్ర ప్రతిష్ట కూడా పెరుగుతుంది. అలాంటి రంగం ఈ రోజు సంక్షోభంలో కొట్ట్టుమిట్టాడుతుంది. పోషకాహారం సైతం అందక అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. అనేకమందికి సరైన ఆదాయం లేక, చేసిన అప్ప్పులు తీర్చలేక ఆకలిచావులకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు మీరిచ్చిన హామీలు అమలు చేస్తారని చేనేత కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గడిచిన రెండేళ్లలో వారి ఆశలు నెరవేరే దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మంగళగిరిలో ఇటీవల జరిగిన 48 గంటల దీక్ష వారి ఆందోళనకు తార్కాణం. ఇప్పటికైనా సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను, ఆకలిచావులకు గురవుతున్న నేతన్నల రక్షణకు, వృత్తిని పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని, చేనేత వృత్తిని ఆదుకోవాలని కోరుతున్నాను.
(1) ఎన్నికల సందర్భంగా మగ్గం ఉన్న వారందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అమలుచేస్తామన్నారు. స్వంత మగ్గం లేకున్నా చేనేత వృత్తిచేసే వారందరికీ ఉచిత విద్యుత్ అమలు చేయాలి.
(2) సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
(3) ప్రభుత్వ వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం రూ.25 వేలు ఆర్ధిక సహకారం నేతన్నలందరికీ, ఉప వృత్తులు చేసుకునే కార్మికులకు వెంటనే చెల్లించాలి.
(4) హ్యండ్‌లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేతలకు 11 రకాల రిజర్వేషన్లను కఠినతరం చేసి అమలు చేయాలి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
(5) చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపలనూలు, పట్టు, రంగులు, రసాయనాలు సబ్సిడీ రేట్లకు అందించాలి.
(6) ప్రతీ నేతన్నకు 3సెంట్లు భూమి ఇచ్చి అందులో హౌస్ కమ్ వర్క్ షెడ్‌లు ప్రభుత్వమే నిర్మించాలి.
(7) ప్రభుత్వ సంస్ధల అవసరాలకు  చేనేత వస్త్రాలనే కొనుగోలు చేసి వాడాలి.
(8) రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం చేయాలి.
పై అంశాలను అమలు చేయడం ద్వారానే సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న నేతన్నలు, కార్మికులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునే విధంగా మీరు వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి