లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరతను సృష్టించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఏప్రిల్, 2026.

 

లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరతను సృష్టించిన 

కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరత సృష్టించిన కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తక్షణం డిమాండ్‌కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డీజిల్, పెట్రోల్ సరఫరాను పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులు తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. కెజి బేసిన్‌లో మన రాష్ట్రం వాటా ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోయారు. ఇప్పటికైనా ఆయిల్, గ్యాస్‌లో 50% సాధించుకుంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడదు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఈ కొరత ఏర్పడడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఎన్నికల తర్వాత రేట్లు పెంచుకోవచ్చని కుట్రపూరితంగా ఆయిల్ కంపెనీలు 10-40% సరఫరాను తగ్గించడంతో వాహన దారులు, రైతులు ఎగుమతి, దిగుమతి రవాణా రెండు రోజుల నుండి తీవ్రంగా ప్రభావితం అయ్యింది. భారీ నష్టాలు వస్తున్నాయని, అమ్మకాలను నియంత్రించాలని  బంకు యజమానులకు గత 4 రోజులుగా కంపెనీలు మెసేజ్‌లు పంపిస్తూ ఇండింట్ ప్రకారం సరఫరా చెయ్యకుండా సమస్యను స్రృష్టించాయి. ప్రైవేటు ఆయిల్ కంపెనీలు. నయారా, రిలయన్స్, జియో కంపెనీల నుండి సరఫరా నిలిపి వేయడంతో  ఇబ్బందులు వచ్చాయని స్పష్టమవుతోంది. తమ లాభాల కోసం ఈ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి. 

యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల నుండి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్దరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి