ఆకివీడు పెదపేట దళితులపై నిర్బంధాన్ని ఆపండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 మే, 2026.

 

ఆకివీడు పెదపేట దళితులపై నిర్బంధాన్ని ఆపండి

`సిపిఐ(యం) డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని గొంతేనమ్మ గుడిని అక్రమంగా కూల్చడమే కాకుండా 3వ తేదీ శంఖుస్థాపన పేరుతో ఆ దళితవాడపై తీవ్ర నిర్భంధం విధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మొత్తం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నది.

దళిత పేటలో నిఘా కెమెరాలు పెట్టి యువతను వేధిస్తున్నారు. వారు దళితవాడ నుండి బయటకు పోయినా, వచ్చినా ఆధార్ కార్డులు చూపమంటూ బెదిరిస్తున్నారు. బయట నుండి ఎవరూ పేటలో అడుగు పెట్టకుండా నిరోధిస్తున్నారు. ఈ రకమైన భయోత్పాతాన్ని సృష్టించి ప్రభుత్వమే దళితుల్ని వేధించడం అమానుషం. వెంfనే నిర్బంధాన్ని ఆపాలని, స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని గొంతేనమ్మ గుడిని నిర్మించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. మరోవైపు ఆ పేటతో సంబంధంలేని విశ్వహిందుపరిషత్, ఆరఎసఎస్ వాళ్లు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతూ, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నా పోలీసులు వారికి మద్దతునివ్వడం అభ్యంతరకరం.

ఆకివీడులో ఉద్రిక్తతలు సృష్టించడమే కాకుండా విజయవాడ, భీమవరం సహా అనేక ప్రాంతాలలో కెవిపిఎస్ కార్యకర్తలను పోలీసులు వెంటపడి వేధించడం, గృహనిర్బంధం విధించడాన్ని ఖండిస్తున్నాము. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి, డప్ప్పు కళాకారుల సంఘం నాయకులు క్రాంతి, పశ్చిమగోదావరి జిల్లా కెవిపిఎస్ నాయకులు రాజగోపాల్, క్రాంతి తదితరులను వెంటపడి, నిఘా పెట్టి వేధించడం దుర్మార్గం. వెంటనే ఇలాంటి నిరంకుశ పద్దతుల్ని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి