భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్
ప్రచురార్థం
03 మే 2026
కల్తీ లడ్డు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను వెంటనే బహిరంగపరచాలని సిపిఐ ఎం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ డిమాండ్ చేస్తున్నది.
*తిరుపతి లడ్డు కల్తీ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ముఖ్యమంత్రి కి అందజేసినట్లు వెల్లడయ్యింది. ఆ నివేదికలోనే అంశాలను ఒక్కో పత్రిక ఒక్కో విధంగా అభివర్ణించాయి. వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియడం అవసరం కనుక కమిషన్ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతపరచాలి. అలాగే కమిషన్ అనేక సూచనలను చేసినట్లు తెలుస్తోంది. కనుక వాటిపై రాష్ట్ర ప్రభుత్వం త్జీసుకోవలసిన చర్యలతో సహా అఖిలపక్ష సమావేశం ముందు ఉంచాలని సిపిఎం కోరుతున్నది.. లడ్డు విషయం ఇప్పటికే పెద్ద వివాదంగా మారింది. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే ఏకాభిప్రాయ సాధనకు ప్రజల్లో ఏర్పడిన అపోహలు తొలగిపోవడానికి తోడ్పడుతుందని సిపిఎం భావిస్తున్నది.
వి. శ్రీనివాసరావు
రాష్ట్ర కార్యదర్శి
