పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 మే, 2026.

పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి 

రూ.10 లక్షలు ప్రకటించాలి.

వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో గందరగోళం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం గిరిజనేతర నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో రూ.5.57 లక్షలు ప్రకటించింది. దీనివల్ల పోలవరం నిర్వాసితులకు ఏరకమైన ఉపశమనం కలగదు. రోజురోజుకీ పెరుగుతున్న స్టీలు, సిమెంటు ధరలు, రవాణా ఛార్జీల ప్రకారం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ రూ.10 లక్షలు చేస్తే తప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరగదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పున:పరిశీలించి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో 2013 భూసేకరణ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్వాసితులను గందరగోళం చేసే చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వస్వం కోల్పోతున్న చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, వేలేరుపాడు, కుకునూరు, దేవీపట్నం మరియు ఎటపాక మండలాల నిర్వాసితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గతంలో చేసిన ఇంటి నిర్మాణాలు కూడా అత్యంత నాసిరకంగా నిర్మాణం చేయడంతో నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు (మంచినీరు, రోడ్లు, స్కూళ్ళు, స్మశానాలు, ఉపాధి) లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

2013 భూసేకరణ చట్టప్రకారం పునరావాస ప్యాకేజీని ప్రతి సంవత్సరం సవరించాలి. కానీ ప్రభుత్వం 2013 చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కి, నిర్వాసితులకు అందాల్సిన న్యాయమైన పరిహారాన్ని ఎగవేస్తోంది. ఈ నాలుగు మండలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నందున రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 5.57లక్షలు ఏ మÖలకూ సరిపోదు. ఇంటి నిర్మాణం, ఇంటి స్థýం కొనుగోలుకు కనీసం రూ.10 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి