
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 మే, 2026.
ఎరువుల ధరలు పెంచొద్దు
పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, ఈ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల ఎరువులను కొరత లేకుండా సరఫరా చేయాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. యుద్దం సాకుతో ఎరువుల కంపెనీలు ఎరువుల ధరలు పెంచడాన్ని ఖండిస్తున్నది. యుద్దం ప్రభావంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి తప్ప ధరలు పెంచడానికి అనుమతినివ్వడం రైతులను ముంచడమే. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెట్టుబడి పెట్టలేక అప్పులపాలవుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతును వ్యవసాయం నుండి బేధఖల్ చేయడమే. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండగానే ఎరువుల ధరలు పెంచడం రైతాంగానికి మోయలేని భారమవుతుంది. ఒక్కో బస్తాకు రూ.125`300లు పెంపుదల వలన రాష్ట్ర రైతాంగంపై రూ.800 కోట్ల భారం పడనున్నది. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఎరువుల ధరలు రైతాంగంపై పడకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఎరువుల సబ్సిడీని పెంచి ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
