యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు వేస్తే ప్రజల ప్రతిఘటన తప్పదు.

నిన్న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో దేశ ప్రజలకు సూచించిన 10 అంశాలపైౖ సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తనను కలిసిన మీడియాతో మాట్లాడిన విషయాలను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి.

యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు వేస్తే ప్రజల ప్రతిఘటన తప్పదు

` హెచ్చరించిన శ్రీనివాసరావు

 

దేశం సంక్షోభంలోకి పోబోతున్నదని చెప్పి ప్రజల నెత్తి మీద పన్నులు వేయటానికి, భారాల పిడుగులు కురిపించడానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఎన్నికలైన మరుక్షణం ప్రధానమంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలు కూడా ప్రభుత్వం భారాలు వేస్తే వాటిని ప్రతిఘటించడానికి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రధానమంత్రి మోడీ నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బంగారం ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని ప్రజలకి బహిరంగంగా పిలుపునిస్తూ అంతర్జాతీయంగా వస్తున్న యుద్ధ పరిస్థితుల్లో సంక్షోభం వస్తుందని, విదేశీ మార్గక ద్రవ్యం సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఆయన చెప్పిన మొత్తం ఈ మాటలు చూస్తుంటే 1990` 91లో సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి ముందున్న తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఈరోజు మరల తిరిగి తలెత్తుతున్నాయి అనే పరిస్ధితికి   నిదర్శనమని అర్ధమవుతున్నది. అంతా సజావుగా ఉంది, మనం సూపర్ పవర్ అవుతున్నాం, విశ్వగురు అవుతున్నాం అని ఒకవైపు డాంబికాలు పలుకుతూ, మరోవైపు సంక్షోభం అంచులో ఉన్నాం అని ప్రజలకు హెచ్చరిక చేయటమంటే ఇది ప్రజలపై పడబోయే భారాల ప్రమాదాన్ని సూచిస్తున్నది. ప్రజల మీద పన్నులు వేయటానికి, పిడుగులు కురిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనినేది మనకు అర్థమవుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. యÖరియా అసలు దొరకటం లేదు. గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్ దొరక్క మొన్న మొన్నటిదాకా క్యూలు ఉన్న పరిస్థితి మనం చూశాము. ఈ స్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ప్రధాని సలహా ఇస్తున్నారƒT. ఈ సలహా ఇవ్వబోయే ముందు ప్రధానమంత్రి తాను స్వయంగా దాన్ని పాటించాలి. హైదరాబాద్ పర్యటన, అంతకుముందు ఎన్నికలలో పెద్ద ఎత్తున సమీకరణలు, యాత్రలు, ఈరోజు సోమనాథ్ 75వ వార్షికోత్సవం పేరుతో పెద్ద రోడ్ షో వంటివి పెడుతున్నారు. వీటికి వేల మందిని సమీకరిస్తున్నారు వాళ్ళందరిని సమీకరించడానికి ఎన్ని వాహనాలు అవసరం అవుతాయి, ఆ వాహనాలకు ఎంత పెట్రోల్, డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ ప్రధానమంత్రికి పట్టవా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రధానమంత్రి పర్యటనకి ఒక్కొక్క చోట 300/ 400 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ప్రతి చోట సమీకరణలు, బస్సులు పెట్టడం జరుగుతుంది. అందుకని ఆయన పర్యటనలు మానుకొని ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ప్రారంభిస్తే చాలా ఆయిల్ మిగులుతుందని సలహా ఇచ్చారు. ఆయన వెళ్లిన ప్రతి చోట జనాన్ని కదిలించడం, ప్రభుత్వం యంత్రాంగం కదలటం, ప్రభుత్వ వాహనాలకు విపరీతమైన ఖర్చని, ముందు తాను పాటించి తర్వాత ప్రజలకు సలహా ఇవ్వటం మంచిదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే బంగారం కొనుగోలు అనేది పెళ్లిళ్లకో లేకపోతే పబ్బాలకో ప్రజలు కొనటం వల్ల ధరలు పెరుగుతున్నాయి అనేది పాక్షికం మాత్రమేనని అసలు వాస్తవం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే లాభాలు రావటం లేదని హార్డ్ క్యాష్ దాదాపు 10లక్షల కోట్ల రూపాయలు నిల్వ ఉన్న వాళ్ళందరూ దాన్ని బంగారంగా మార్చుకుంటున్నారని తెలిపారు.  కార్పొరేట్ల వల్ల పెరుగుతున్న బంగారం ధరలను సామాన్య ప్రజలకు ముడిపెట్టి పెళ్లిళ్లలకు బంగారం కొనవద్దని ఒక సంవత్సరం పాటు నిషేధం పెడతామని చెప్పడం అంటే అన్యాయమని, ఫలితంగా ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోయిందన్నారు. మరోవైపు బంగారం దిగుమతి ఏమీ ఆగలేదని కార్పొరేట్లను కంట్రోల్ చేయమని సలహా ఇవ్వాల్సిందన్నారు. ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకొని బడా కార్పొరేట్లను కంట్రోల్ చేస్తే మనం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎంతో కొంత బయటపడటానికి అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.