
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 మే, 2026.
ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలను ఆపాలి
-సిపిఐ(యం) డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా ఉనుదుర్రు గ్రామంలో పేదల ఇళ్ళను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్న సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ మరియు జిల్లా కమిటీ సభ్యుడు డి.శ్రీనివాస్‌ని పోలీసుల గృహనిర్భందం చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. వెంటనే ఉండి నియోజకవర్గంలో కొనసాగుతున్న పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేస్తున్నది.
గత సంవత్సర కాలంలో ఉండి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఆక్రమణలు, కాలుష్యం పేరుతో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అండదండలతో పేదల ఇళ్ల కూల్చివేతలు జరిగాయి. ఇప్ప్పుడు ఉనుదుర్రు గ్రామం 50 ఏళ్ళకు పైగా నివాసం ఉంటున్న వారికి కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా అక్రమంగా 60 ఇళ్లను నేలమట్టం చేయడం అన్యాయం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
