
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 మే, 2026.
బస్సు ప్రమాదాల నివారణకు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఆర్టీసి యాజమాన్యంలోనే నడపాలి
ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద నిన్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టైరుపేలి అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ మధ్యకాలంలో ప్రయివేటు బస్సు ప్రమాదాలు పెరగడం, మంటల్లో కాలిపోవడం వలన అనేకమంది ప్రయాణికులు మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విచారం వ్యక్తం చేస్తున్నది. ప్రమాదాల నివారణకు ప్రయివేటు ట్రావెల్ బస్సులన్నీ ఆర్టీసి యాజమాన్యంలోనే నడిపేట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
ప్రయివేటు ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించడం లేదు. బస్సులు కండిషన్‌లో ఉన్నాయా లేదా అనేది రెగ్యులర్ చెకప్ లేదు. మధ్యలో ప్రమాదానికి గురవడమో, ఆగిపోవడం వలన ప్రయాణికులు చనిపోవడం, గాయపపడం, నానా అవస్తలు పడుతున్నారు. డ్రైవర్లకు సరైన శిక్షణ లేకుండా, అర్హులైన డ్రైవర్లను నియమించకుండా ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం నడుపుతున్నారు. యాజమాన్యం డ్రైవర్లకు రెస్ట్ లేకుండా డ్యూటీమీద డ్యూటీ వేసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలా వరకు ప్రమాదాలు నివారించాలంటే, సురక్షిత ప్రయాణం ప్రజలకు అందివ్వాలంటే ప్రభుత్వ యాజమాన్యంలోనున్న ఆర్టీసి ద్వారానే బస్సులు నడపాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
