ఉద్దరాజు బాపిరాజు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 మే, 2026.
ఉద్దరాజు బాపిరాజు మృతికి సంతాపం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, సిపిఐ(యం) పూర్వ రాష్ట్ర నాయకులు ఉద్దరాజు రామం, మాణిక్యాంబ మూడవ కుమారుడు ఉద్దరాజు బాపిరాజు (80) మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాపిరాజు హైదరాబాద్‌లో రక్షణశాఖ ఉద్యోగిగా ట్రేడ్ యూనియన్ నాయకుడుగా పనిచేశారు. అభ్యుదయ, సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్వాతంత్య్ర ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమ సమాచారం సేకరణలో విశేష కృషి చేశారు. పార్టీ నాయకులతో ఆప్యాయ పూర్వక సంబంధాలు కొనసాగించేవారు. ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. జీవితాంతం తల్లిదండ్రుల అభ్యుదయ వారసత్వాన్ని కొనసాగించారు. వారి మృతి వామపక్ష, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి