పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 మే, 2026.

 

పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా 

నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ(యం) పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్రం కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ద్వారా దాడి చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. బిజెపి చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఇడి సిపిఐ(యం)ను అప్రతిష్టపాలు చేయాలన్న దుర్బుద్దితో దాడులకు పూనుకొన్నది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా నిరసనలు తెలియజేయాల్సిందిగా సిపిఐ(యం) పిలుపునిస్తున్నది.

ముఖ్యమంత్రిగా బాధ్యతల నుండి తొలగిన వెంటనే కన్నూరు మరియు తిరువనంతపురంలోని విజయన్ ఇళ్లపై ఇడి దాడి చేయడం కక్షపూరితం, అప్రజాస్వామికం. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇడి, సిబిఐ, ఎనఐఎ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడమే. కేంద్ర ప్రభుత్వ  కక్షపూరిత చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని పార్టీ శాఖలకు పిలుపునిస్తున్నది. ఈ దాడులను ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ఖండించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి