క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూన్, 2026.

క్యూబా సంఘీభావ నిధి అందించిన 

ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు

సోషలిస్టు క్యూబాపై దుర్మార్గంగా ఆంక్షలు విధించి తిండి, మందులు, ఇంధనం లేకుండా మాడ్చి చంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంపు చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తూ ఏప్రిల్ 7వ తేదీ ఒక్కరోజు క్యూబా సంఘీభావ నిధికి సిపిఐ(యం) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు రూ.33 లక్షలు విరాళంగా అందించారు. ఆదరించిన ప్రతి ఒక్కరికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుపుతున్నది.

సోషలిస్టు క్యూబా ప్రభుత్వాన్ని కూల్చాడానికి అమెరికా సామ్రాజ్యవాదం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఆయిల్, మెడిసిన్స్ వంటి అత్యవసరాలు సరఫరా కాకుండా స్తంభింపజేస్తున్నది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి క్యూబన్ ప్రజలు అకుంఠిత దీక్షతో పోరాడుతున్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం దుర్మార్గాలకు వ్యతిరేకంగా క్యూబన్ ప్రజలకు సంఘీభావంగా నిలబడాల్సిన బాధ్యత శాంతికాముకులపై ఉంది.

భారతదేశ ప్రజలకు క్యూబా మిత్రదేశం. అలీనోద్యమంలో కలిసిమెలసి పనిచేశాము. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న సంప్రదాయం భారతీయులకుంది. ఆ సంప్రదాయవారసత్వంగానే భారత కమÖ్యనిస్టు పార్టీ (మార్క్సిస్టు) క్యూబన్ ప్రజలకు మద్దతు పలికి క్యూబా ఒంటరి కాదని చాటి చెప్పింది. పలు పార్టీలు, శాంతికాముకులతో క్యూబా సంఘీభావ కమిటీ ఏర్పడి నిధికి పిలుపునిచ్చింది. మందులు సహా అవసరమైన వస్తువులు పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మార్చి 27న బహిరంగ సదస్సులో సాలిడారిటీ ఫండ్‌కు సిపిఐ(యం) పిలుపిచ్చిన వెంటనే రాష్ట్రవ్యాపితంగా మంచి స్పందన వచ్చింది. వ్యక్తులు, సంస్థలు, వీధి వసూళ్ళ ద్వారా ప్రజలు ఉదారంగా విరాళాలిచ్చారు. నేటి వరకు రాష్ట్రంలో రూ.33,05,711లు వసూలైంది. వసూలైన మొత్తాన్ని క్యూబాకు పంపేందుకు జాతీయ సంఘీభావ నిధికి అందించాము.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి