విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్, 2026.

విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి

మృతులకు సంతాపం - కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్

కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘోర ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నది. ఊహించని ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడటం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నది. మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారి కుటుంu సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 లక్షలు ప్రకటించాలి. తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలి. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రయివేటీకరిచేందుకు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్లాంటు పూర్తిగా దెబ్బతింటున్నది. అందువల్ల ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి దీనిపై ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. తక్షణమే ఈ ప్రమాద కారణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

ప్రభుత్వ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని, ఆధునికరిస్తున్నామని చేసిన ప్రకటనలు ఆర్భాటానికేనని తేలిపోయింది. కాలం చెల్లిన యంత్రాలను వాడడం, నాసిరకం మెటీరియల్ వాడడం, ఎప్పటికప్పుడు వాటిని మెయింటనెన్సు చేయకపోవడం ఫలితంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. క్వాలిటీ చెక్‌చేసేవారు లేకపోవడం, పాత వారిని తొలగించి అనుభవం లేని కొత్త కాంట్రాక్టు కార్మికులను అదీ తక్కువ మందిని పెట్టడం, యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. కార్మికుల సంఖ్యను పెంచి ఆధునీకరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి