
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 జూన్, 2026.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల నియామకాలపై
న్యాయ విచారణ జరిపించాలి
డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరి సర్టిఫికేట్‌లను బహిరంగపర్చాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. స్పోర్ట్స్ కోటా ఎంపికకు రూపొందించిన జివోలు, వాటి అమలు తీరుపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్పందించాలి. విడివిడిగా జరగాల్సిన డిఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే డైరెక్టర్‌కి ఎందుకు అప్పగించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఈ అంశాలపై ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చిన ప్రతిసారీ మరికొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో పాల్గొన్న క్రిడా కారుల్లో కొద్దిమంది స్పోర్ట్స్ కోటాకు ఎంపిక కాకపోవడం అనేక అనుమానాలకు తావునిస్తున్నది. డిఎస్సీ ఉద్యోగ నియామకాలలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిపేందుకు న్యాయవిచారణకు ఆదేశించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
