పడవ ప్రమాదం పట్ల సిపిఐ(యం) విచారం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 జూన్, 2026.

పడవ ప్రమాదం పట్ల సిపిఐ(యం) విచారం

పల్నాడు జిల్లా కోనూరులో కృష్ణా నదిలో పడవ బోల్తాపడి ముగ్గురు చిన్నారులతో సహా నలుగురు మరణించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ విచారం వ్యక్తం చేస్తున్నది. మరణించినవారికి సంతాపం తెలియజేస్తున్నది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.  ఆరుగురి ప్రాణాలను కాపాడిన గ్రామస్తులను సిపిఎం రాష్ట్ర కమిటీ అభినందిస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి