
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 జూన్, 2026.
సిజెపి అభిజిత్ దీప్కేపై దాడికి ఖండన
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కేపై ఈరోజు బిజెపి పాలనలోని రాజస్తాన్ రాష్ట్రం లోని జైపూర్‌లో ర్యాలీ చేస్తుండగా కొంతమంది దాడిచేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. పార్టీ ప్రారంభించినప్పటి నుండీ సోషల్ మీడియాలో సిజెపిపై విషం కక్కుతున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ యువతలో ముందుకొచ్చినప్పటి నుండే దాడి తీవ్రమైంది. విధానాలను వ్యతిరేకించేవారిపై భౌతికదాడులు చేయడం పెరుగుతున్న నిరంకుశ ధోరణులకు నిదర్శనం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. యువతలో వస్తున్న అసంతృప్తిని పరిష్కరించలేక దాడులకు పూనుకోవడం గర్హనీయం. ఇటువంటి దాడులు ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు వ్యతిరేకించాలి. ప్రజా ఆందోళనలకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
