
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 జూన్, 2026.
హోమ్ మంత్రి అనితపై అమర్‌నాథ్ వ్యాఖ్యలకు సిపిఐ(యం) ఖండన
రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి, వైసిపి నాయకులు అమర్‌నాథ్ వాటిని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. వైసిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మహిళలపట్ల అవమానకరంగా మాట్లాడేవారిని అదుపు చేసి హుందాగా వ్యవహరించేటట్లు చూడాలని కోరారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అమర్‌నాథ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యానాలు చేయడం రాజకీయ విలువలను దిగజారుస్తుంది. రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా ఎవరు ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగినా, దూషణలకు పాల్పడినా సిపిఐ(యం) మొదటి నుండీ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ వస్తున్నదన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు విలువలను దిగజార్చే ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.
విశాఖ ఎంపీ శ్రీ భరత్ వ్యాఖ్యలపై తెలుగుదేశం వివరణ ఇవ్వాలి
వి.శ్రీనివాసరావు డిమాండ్
బీచ్ షాక్స్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలుగుదేశం నాయకులు, విశాఖ పార్లమెంటు సభ్యులు అయిన శ్రీభరత్ విశాఖ సముద్ర తీరంలో “బీచ్ షాక్స”ను ప్రారంభించడాన్ని సమర్దిస్తూ అందరూ తాగుతున్నవారేనని అంటూ మద్యాన్ని ప్రోత్సహించడంపై తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వాఖ్యలు యువతరాన్ని మత్తులో ముంచి దేనికీ పనికిరానివారిగా చేయడానికే తోడ్పడతాయి. అందులోనూ ఆయనొక విద్యాసంస్థల యజమానిగా భావితరం నాయకులైన విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం ఆయన వాఖ్యల్ని బేషరతుగా ఖండిస్తూ ముందుకు రావాలని కోరారు. దీనికి మÖలమైన ‘బీచ్ షాక్స’ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ విలువలు, సంస్కృతిపై నీతులు చెప్పే బిజెపి, ఆరఎసఎస్, పవన్ కళ్యాణ్ దీనిపై తమ వైఖరి వెల్లడించాలని కోరారు.
విశాఖ ఎయిర్‌పోర్టును కొనసాగించాలని ప్రజలు కోరుతుంటే దానిపై జిఎంఆర్ నిర్ణయం తీసుకోవాలని శ్రీభరత్ చెప్పడం అభ్యంతరకరం. విశాఖ ఎయిర్‌పోర్టు ప్రభుత్వానిది. జిఎంఆర్‌కు దీనికి సంబంధం లేదు. ప్రభుత్వాన్ని కార్పొరేట్ రాజ్యంగా భరత్ మారుస్తున్నట్లు కనిపిస్తున్నది. యంపిగా ఉన్న శ్రీ భరత్ చట్టవిరుద్దంగా మాట్లాడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నదన్నారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ సమయంలో 40 నుండి 50 వేల మందికి, ఆ తర్వాత నిర్వహణకు వెయ్యికిలోపే ఉద్యోగాలుంటాయని శ్రీభరత్ చెప్పారు. లోకేశ్ పదే పదే చెప్తున్న లక్ష 80 వేల ఉద్యోగాల ఊరింపుకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గూగుల్/ అదానీ సెంటర్‌లో ఉపాధి, రాయితీలపై వాస్తవాలతో వివరణ ఇవ్వాలని, యువతను భ్రమల్లో పెట్టవద్దని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
