ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (నిన్న) ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 జూన్, 2026.

 

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్.

 

విషయం: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జూన్ 15 నుండి ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు కూడా బూత్‌లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నాయి. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేశారు. ఆ లిస్టుల్ని రాజకీయ పార్టీలకు అందించినట్లయితే బిఎలఏల పని మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. బూత్ స్థాయి కాపీలను రాజకీయ పార్టీలకు అందించాలని కోరుతున్నాను. ఎసఐఆర్‌పై మే 26వ తేదీన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిపినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు 2002 నాటి జాబితా ఇవ్వమని మిమ్ములను కోరాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదిస్తామని మీరు చెప్పారు. కానీ ఎసఐఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆ జాబితా రాజకీయ పార్టీలకు అందలేదు.

కావున మీరు 2002 నాటి ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు అందజేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి