దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జూన్, 2026.

దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో

మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి

పరవాడ ఇండస్ట్రియల్ జోన్‌లో ఈరోజు తెల్లవారు జామున జరిగిన దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. గోవాడకు చెందిన వేపాడ వెంకటేష్ (34), త్రినాథ్ (24) మృతి చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు సిపిఐ(యం) ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తోంది.

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ యాజమాన్యం, ఫ్యాక్టరీలపై తనిఖీలు జరపాల్సిన కార్మికశాఖ, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టరేట్ యంత్రాంగం పూర్తిగా విఫలమవడమే. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కంపెనీల్లో తనీఖీలు నిలుపుదల చేయడంతో యాజమాన్యాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులకు రక్షణ బలహీనపర్చారు. ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యాలకు దాసోహం అవుతూ, కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేయడం దుర్మార్గం. అభివృద్ధి పేరుతో కంపెనీలకు ఎర్రతివాచీలు పరచడం తప్ప, కార్మికుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరించడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దక్షిణ ఎనర్జీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి