ఉండవల్లి ఘటనపై సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 జూన్, 2026.

ఉండవల్లి ఘటనపై సిపిఐ(యం) ఖండన

రాజధాని అమరావతి లోని ఉండవల్లి గ్రామంలో నేడు వైసీపీ నేతలు, పోలీసులపై జరిగిన భౌతిక దాడులను సిపిఐ(యం) ఖండిస్తోంది. ఈ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసిపి నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరిపై రాజకీయంగా ఎదుర్కోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షం చేసిన దాడులను వ్యతిరేకించిన తెలుగుదేశం, నేడు అదే పద్ధతిలో భౌతిక దాడులను సమర్దించడం అప్రజాస్వామికం. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి, టిడిపి నాయకత్వం ఇలాంటి భౌతిక దాడులను అరికట్టకపోతే శాంతిభద్రతలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఈ దాడిని ప్రజాతంత్రవాదులు ఖండించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి