వియత్నాంలో బోటు ప్రమాద ఘటనలో మరణించినవారికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 జూలై, 2026.

వియత్నాంలో బోటు ప్రమాద ఘటనలో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు ఇందులో మరణించినవారికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నది. మృతిచెందిన 15 మంది టూరిస్టుల్లో మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారని తెలుస్తున్నది. ఒక ప్రయివేటు కంపెనీ విహారయాత్రకు తీసుకెళ్ళిన సందర్భంగా పూక్వాక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మృతిచెందినవారి పూర్తి వివరాలు రావలసి ఉంది. మృతి చెందిన వారి భౌతిక కాయాలు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి