ఏజెన్సీలో అశాంతిని సృష్టించొద్దు ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి..

స్క్రోలింగ్/ ప్రచురణార్ధం/ప్రసారార్ధం : 

ఏజెన్సీలో అశాంతిని సృష్టించొద్దు ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి

ఆదివాసీల దీర్ఘకాలిక హక్కులకి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో 1/70 చట్టాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని, దాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ అంతటా ప్రదర్శనలు, సభలు జరుగుతున్నాయి. ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో  నేడు రంపచోడవరంలో జరుగుతున్న ర్యాలీ, సభపై పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టి జనం రాకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిపిఐ(ఎం) దీన్నీ తీవ్రంగా ఖండిస్తున్నది. రంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసి ప్రజలు ప్రత్యేకించి యువతి యువకులు ప్రశాంతంగా వస్తున్న సందర్భంలో వారిని దారి మధ్యలో ఆటంకపరిచి రెచ్చగొట్టడం ద్వారా ఏజెన్సీలో అశాంతి పరిస్థితినీ ప్రభుత్వమే సృష్టిస్తున్నది.  ఆదివాసి యువత అసంతృప్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారు చెప్పేది విని 24వ తేదీ ముఖ్యమంత్రి రంపచోడవరం వస్తున్న సందర్భంగా వాటిపై స్పందించి పరిష్కరిస్తే యువతలో ఆందోళన పరిష్కారం అవుతుంది. అందుకు బదులుగా నిర్బంధ పద్ధతుల ద్వారా అడుకోవాలనుకోవడం అవివేకం. 24 న ముఖ్యమంత్రి సభకు కూడా ఇదే మాదిరి జనాన్ని రాకుండా ఆటంక పరుస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాము.  అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం అన్ని రకాల అండదండలు ఇస్తూ ఆదివాసీల సంఘాలపై ఈ రకంగా నిర్బంధం ప్రయోగించడం దారుణం. వెంటనే హోం మంత్రి, డీజీపీ జోక్యం చేసుకొని రంపచోడవరం సభ ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుచున్నాను.
వి.శ్రీనివాసరావు 
సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి